
న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 05.
పోస్టులు: 05 (యంగ్ ప్రొఫెషనల్స్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్. ఎంబీఏ లేదా సమాన ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 05.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ప్రాక్టికల్, రాతపూర్వక, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.bis.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.