కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  మ్యాచ్ ఫిక్సింగ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  మ్యాచ్ ఫిక్సింగ్
  • బీజేఎల్పీ నేత ఏలేటి ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్  మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని, దీంట్లో మంత్రి పొంగులేటి మధ్యవర్తిగా వ్యవహారం నడిపిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అందుకే గత ప్రభుత్వ తప్పిదాలపై ప్రస్తుత కాంగ్రెస్  సర్కారు సీబీఐ ఎంక్వైరీ కోరడం లేదన్నారు. సర్కారుకు దమ్ముంటే, సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ నేత కేటీఆర్  ఒక డ్రామారావు అని ఆయన ఎద్దేవా చేశారు. గత 9 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు గత బీఆర్ఎస్  ప్రభుత్వం చేసిన ఎన్నో తప్పిదాలను బయటకు తెచ్చామన్నారు.