హైదరాబాద్లో పబ్కు పోయిన అమ్మాయిలకు చేదు అనుభవం

హైదరాబాద్లో పబ్కు పోయిన అమ్మాయిలకు చేదు అనుభవం

గచ్చిబౌలి, వెలుగు: ఓ పబ్​లో నిర్వహించిన మ్యూజిక్​ ఈవెంట్​కు ఎంజాయ్​ చేద్దామని వెళ్లిన అమ్మాయిలను షాక్​ తగిలింది. వారి ఫోన్లు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న కొండాపూర్​లోని క్వేక్​ ఎరినా పబ్​లో జర్మనీకు చెందిన ప్రముఖ డీజే ప్లేయర్​ బెన్ బోహ్మెర్ మ్యూజిక్​ ఈవెంట్ నిర్వహించాడు. దీనికి వందలాది మంది హాజరై ఎంజాయ్​ చేస్తున్నారు. 

ఇదే అదునుగా కొందరూ వ్యక్తులు యువతుల సెల్​ఫోన్లను కొట్టేశారు. ఎంజాయ్​ చేద్దామని వస్తే ఫోన్లు చోరీ చేయడంతో కంగుతిన్న ఓ యువతి ఈ విషయమై ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. దీంతో ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు నలుగురు యువతులు తమ సెల్​ఫోన్ చోరీకి గురైనట్లు సీఈఐఆర్​ పోర్టల్​లో ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్​లోని సీసీ ఫుటేజీ చెక్​ చేయగా ఆధారాలు లభించలేదు.