హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశానికి అడిషనల్ కలెక్టర్లు,హెచ్ఎండీఏ అధికారులను పిలవాలని జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్, బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కమిషనర్ ఆర్వీ కర్ణన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్కాగిజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ... ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఎటువంటి లాభం లేకుండానే జీహెచ్ఎంసీ ఆస్తులు ఇతర శాఖలకు బదాలాయించడం వల్ల బల్దియాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వీటిపై చర్చ జరిగితే జీహెచ్ఎంసీకి వందలకోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఈ సమస్యలపై చర్చించేందుకు ఆ సంబంధిత శాఖ వారిని కౌన్సిల్ సమావేశానికి పిలిపించాలని శంకర్ యాదవ్ లేఖలో డిమాండ్ చేశారు.
