టెట్ సిలబస్పై రివ్యూ కమిటీ!..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిర్ణయం

టెట్ సిలబస్పై రివ్యూ కమిటీ!..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) సిలబస్​పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ పునరాలోచనలో పడింది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్​తో సిలబస్ రివ్యూ కమిటీ వేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 17న ‘టీచర్లకు టెట్ తిప్పలు’ హెడ్డింగ్​తో వెలుగు కథనం ప్రచురించింది. దీంట్లో సంబంధం లేదని సిలబస్ లో పేపర్ రాయాలని లాంగ్వేజెస్, బయాలజీ, ఫిజిక్స్ తో పాటు వివిధ సబ్జెక్టుల టీచర్లకు  ఆదేశాలివ్వడాన్ని వివరించింది.

 దీనిపై సర్కారు స్పందించింది. టెట్ లో సిలబస్ ఎలా ఉంది?  అనే అంశాలను పరిశీలించాలని డిసైడ్ అయింది. ప్రస్తుతమున్న సిలబస్​ తో ఇన్ సర్వీస్ టీచర్లు పరీక్ష రాస్తే.. వారంతా పాస్ కావడం కష్టంగా మారింది. దీనికి ప్రధాన కారణం15, 20 ఏండ్ల నుంచి ఒకే సబ్జెక్టులో బోధన చేయడమే. వారి సబ్జెక్టుకు సంబంధం లేని సిలబస్ టెట్​ లో​ఎక్కువగా ఉండటంతో టీచర్లంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సబ్జెక్టుల ఆధారంగా టెట్ ఎగ్జామ్ పెట్టాలనే డిమాండ్ కూడా వస్తోంది. అయితే, ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్​ లు ఇచ్చే నివేదికను అధకారులు సర్కారుకు పంపించనున్నారు. నివేదిక ఆధారంగా వచ్చే టెట్ ఎగ్జామ్ నుంచి సిలబస్​ లో మార్పులు చేసే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు  చెప్పారు.