వెయ్యి రూపాయలు పెట్టలేకనే.. ఫ్రీగా ఐబొమ్మలో సినిమా చూస్తున్నరు

వెయ్యి రూపాయలు పెట్టలేకనే.. ఫ్రీగా ఐబొమ్మలో  సినిమా చూస్తున్నరు

ఐబొమ్మ నిర్వాకుడు ఇమంది రవిని అరెస్ట్ చేయడంతో తెలంగాణ పోలీసులపై   తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ప్రెస్ మీటి నిర్వహించి..తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు తెలిపారు పలువురు నిర్మాతలు, డైరెక్టర్లు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్లు రూ.1000కి పెంచడం వల్లే ప్రేక్షకులు  ఐబొమ్మలాంటి వెబ్ సైట్లలో సినిమాలు చూస్తున్నారు. డబ్బులున్న వాళ్లే థియేటర్లో వెయ్యి పెట్టి సిన్మా చూస్తారు...సినిమా చూడాలనుకునే  సగటు  ప్రేక్షకులు దొంగదారిన అంటే ఇలాంటి ఐబొమ్మలో ఫ్రీగా వస్తుంది కాబట్టి సినిమాలు చూస్తున్నారు. నేను ఇండస్ట్రీలో 50 ఏళ్ల అనుభవంతో చెబుతున్న  నిజం.  భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారని..టికెట్లు రేట్లు పెంచితే ఎలా.?..భారీ బడ్జెట్ లో 90 శాతం బడ్జెట్  ఒకరిద్దరి రెమ్యునరేషన్లకే వెళ్తుంది.  వీటి ప్రభావం టికెట్ల రేట్లపై పడుతుంది. అపుడు సినిమాను దొంగదారిన చూస్తున్నారు ప్రేక్షకులు. భారీ బడ్జెట్ సినిమాలు ఏడాదికి  10 వస్తాయి..వీటి వల్ల చిన్న సినిమాలు  నష్టపోతున్నాయి. క్వాలిటీ సినిమాలు తీయాలి కానీ..ఎక్కువ బడ్జెట్ సినిమాలు కాదు. సినిమాలు  పైరసీ క్యూబ్, వీఎఫ్స్ లాంటి ప్లాట్ ఫారమ్ ల నుంచి బయటకు వెళ్తుంది.నిర్మాతలు ముందు వాటిపైన దృష్టి పెట్టాలి అని వ్యాఖ్యానించారు.

ఐబొమ్మ రవికి ఐదు రోజుల కస్టడీ

మరో వైపు  ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఐదు రోజుల పాటు రవిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్‎సైట్ నిర్వాహకుడు రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు కూకట్ పల్లిలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు రవికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఐబొమ్మ కేసులో మరిన్నీ వివరాలు రాబట్టేందుకు నిందితుడు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా..కోర్టు ఐదురోజుల కస్టడీకి అనుమతిచ్చింది. 

►ALSO READ | ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ