హైదరాబాద్: ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఐదు రోజుల పాటు రవిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు కూకట్ పల్లిలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు రవికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఐబొమ్మ కేసులో మరిన్నీ వివరాలు రాబట్టేందుకు నిందితుడు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.
►ALSO READ | Aishwarya Rai : ' సేవ చేయడమే నిజమైన నాయకత్వం'.. ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్!
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు రవిని ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరిన్నీ వివరాలు రాబట్టనున్నారు. పోలీస్ కస్టడీలో ఐబొమ్మ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది.
