హైదరాబాద్ శివారులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా లోని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపుర్ లోని పరుపులు, సోఫా సెట్ లకు సంబంధించిన ఫోమ్ తయారీ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ( నవంబర్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఔషాపుర్ లోని ఫోమ్ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఫోమ్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.విద్యుత్ షాక్ తో ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు
ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో గోడౌన్ లో ఉన్న మెటీరియల్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. అయితే.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
