మొఘల్స్, బ్రిటిష్ వారికి లొంగని ఏకైక భారత రాష్ట్రం ఇదే.. 400 ఏళ్ళు కాపాడారు ?

 మొఘల్స్, బ్రిటిష్ వారికి లొంగని ఏకైక భారత రాష్ట్రం ఇదే.. 400 ఏళ్ళు  కాపాడారు ?

మీకు తెలుసా..? మన భారతదేశంలో ఒక రాష్ట్రంని  బ్రిటిష్ కానీ, మొఘల్ సామ్రాజ్యాలు కానీ ఎప్పుడూ కూడా పూర్తిగా వాటి ఆధీనంలోకి తీసుకోలేదు. ఎందుకో తెలుసా... ఈ అద్భుతమైన రాష్ట్రం పేరు గోవా. చాలా మందికి ఇదొక ఇష్టమైన టూరిస్ట్ స్పాట్... అరేబియా సముద్రం పక్కన ఉంటుంది. ఇక్కడి బీచ్‌లు ప్రపంచవ్యాప్తంగా చాల ఫెమస్.. 

 గోవా బ్రిటిష్ వారి పాలనలో లేదా మొఘల్స్  పాలనలో లేకపోవడానికి కారణం... ఇది దాదాపు 400 సంవత్సరాలు పోర్చుగీసు వారి పాలనలో ఉండటమే. బ్రిటిష్ వారు భారతదేశంలోకి అడుగుపెట్టక ముందే పోర్చుగీసు వారు ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు. 1498లోనే వాస్కో డ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని, ఈ ప్రాంతంలో పోర్చుగీసు వ్యాపారాన్ని మొదలుపెట్టారు.

►ALSO READ | ఉపాసన అభిప్రాయంతో వ్యతిరేకించిన శ్రీధర్ వెంబు.. 20లలో పెళ్లి పిల్లల ప్లాన్‌కి అడ్వైజ్

 పోర్చుగీసు వారు 1608లో వచ్చిన బ్రిటిష్ వారికి ముందే గోవాను వారి పట్టులో ఉంచుకున్నారు. తమ వలస పాలన సమయంలో వారు బ్రిటిష్ విస్తరణ నుండి గోవాను కాపాడుకున్నారు, కాబట్టి గోవా ఎప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం కాలేకపోయింది. దాదాపు 400 సంవత్సరాల పాటు పోర్చుగీసు వారు గోవాను పాలించడం వల్ల ఇక్కడి సంస్కృతి, నిర్మాణ స్టయిల్,  వంటకాలపై వారి ప్రభావం చాలా బలంగా పడింది. ఇప్పటికి ఇక్కడి పాత చర్చిల్లో, కోటల్లో, స్థానిక ఆహార అలవాట్లలో వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

గోవా చాలా కాలం పాటు పోర్చుగీసు పాలనలోనే ఉండిపోయింది. చివరికి 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా పోర్చుగీసు పాలనను అంతం చేసి గోవాను భారతదేశంలో కలిపింది.