కార్తీకమాసం ఈ ఏడాది ( 2025) రేపటితో ( నవంబర్ 20) తో ముగియనుంది. కార్తీక అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం..!
కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ( 2025 నవంబర్ 20) చాలా శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు. ఆ రోజున పూర్వికులను స్మరించుకోవడానికి, పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు. కార్తీక అమావాస్య నాడు పితృ దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తాన్ని శక్తివంతమైనదిగా భావిస్తారు. ఆ రోజు ( నవంబర్ 20) దాన ధర్మాలు చేసినా, నది స్నానాలు చేసినా ఎంతో పుణ్యం కలుగుతుంది. ముఖ్యంతా పితృ దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించచాలని పండితులు చెబుతున్నారు.
చేయాల్సిన పరిహారాలు ఇవే..!
- కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేయాలి.
- స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ |
- నర్మదే సింధు కావేరి జలేయస్మిన్ సన్నిధిం కురు || అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.
- అవకాశం ఉంటే నది స్నానం చేయడం మంచిది. దగ్గరలో నది లేకపోతే ఇంటి దగ్గర బావి దగ్గర గాని.. కుళాయి వద్దగాని స్నానం చేసినా అలాంటి ఫలితమే కలుగుతుంది.
- తరువాత సూర్యభగవానుకి నమస్కరించాలి.
- రాగి పాత్రలో నీళ్లు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్రటి పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
- శివ–కేశవుల్ని స్మరిస్తూ కార్తీక అమావాస్యనాడు పూజలు చేయాలి.
- స్వామివారికి పువ్వులు, పసుపు, చందనం, అక్షింతలు తో పాటు నైవేద్యాన్ని కూడా సమర్పించాలి.
- కార్తీకమాసంలో 365 వత్తులు వెలిగించని వారు ఈ రోజున ( 2025 నవంబర్20) వెలిగించినా అంతటి ఫలితం వస్తుంది.రుద్రాభిషేకం చేయాలి
కార్తీక అమావాస్య నాడు జపించాల్సిన మంత్రం ఇదే ..
- పితృదేవతలకు నువ్వులు నీళ్లు.. తర్పణాలను వదులుతూ ఓం పితృదేవాయ నమం: అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి. బ్రాహ్మణులకు వస్త్రదానం చేయలి. ఇలా చేయడం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.
- కార్తీక అమావాస్య ( 2025 నవంబర్ 2) సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. పిండి దీపాన్ని వెలిగించండం వలన శాంతి, సంతోషం ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది.
- సాయంత్రం ప్రదోష సమయంలో రావిచెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టాలి. ఆకాశదీపం కింద నుండి వెళ్లి శివ పరమాత్ముడిని దర్శనం చేసుకోవాలి.
- దగ్గరలో ఉన్న శివాలయాలు, విష్ణు దేవాలయాలను దర్శించుకుని, దేవుడికి అభిషేకం లేదా ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వలన ఈ మాసానికి సంబంధించిన విశేష ఫలాన్ని పొందవచ్చుని పండితులు చెబుతున్నారు. .
- క్షమాపణ కోరడం: ముందుగా, మాసం మొత్తం దీపారాధన చేయలేకపోయినందుకు శివుడిని ..విష్ణువును మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలి.
- దీపారాధన: వీలైనన్ని ఎక్కువ దీపాలను (నూనె లేదా నెయ్యితో) వెలిగించాలి. ఇంటి ముందు, పూజా మందిరంలో, తులసి కోట వద్ద, ఆకాశ దీపం (వీలైతే) కూడా వెలిగించి, మాసం మొత్తం దీపం వెలిగించిన ఫలాన్ని పొందడానికి సంకల్పం చెప్పుకోవాలి.
- పేదవారికి లేదా ఆలయాలకు శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. దీపం వెలిగించడానికి నూనె, వత్తులు దానం చేయడం శుభప్రదం.
కార్తీక అమావాస్య కేవలం మాసం ముగింపు మాత్రమే కాదు. ఈ మాసంలో చేసిన సత్కర్మల ఫలాన్ని పరిపూర్ణం చేసుకునే ఒక పవిత్ర అవకాశం. ఆ రోజున ( నవంబర్ 20) భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించినా, చిన్న దానం చేసినా గొప్ప పుణ్యం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
