తెలుగు సంవత్సరాల్లో చివరి మాసం.. ఫాల్గుణ మాసం. పురాణాల ప్రకారం ఈ నెలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల సర్వ దేవతలను పూజించేందుకు అనుకూలమైన నెల. ఇక ఏకాదశి అంటే వేరే చెప్పనక్కర లేదు. ఫాల్గుణమాసం శుక్ల పక్షంలోవచ్చే ఏకాదశిని అమలిక ఏకాదశి అంటారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజున ( ఫిబ్రవరి 27) ఉసిరి చెట్టుకింద ఆవనూనెతో దీపారాధన చేస్తే ఆస్తి...ఐశ్వర్యం రెట్టింపు అవుతాయని.. ఇంకా జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అసలు ఆరోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!
ఏకాదశి తిథి రోజున సాధారణంగా లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆరోజు చాలామంది ఉపవాస దీక్షను పాటిస్తారు. ఫాల్గుణమాసం శుక్షపక్షంలో వచ్చే ఏకాదశి ఉసిరి కాయ ఏకాదశి అంటారు. సంస్కృతంలో ఆమ్ల ఏకాదశి అంటారు. క్రమేణ అది అమలిక ఏకాదశిగా మారింది.
ఈ ఏడాది ( 2026) అలాంటి పవిత్ర దినం ఫిబ్రవరి 27న వచ్చింది. పురాణాల ప్రకారం ఆ రోజున ఉసిరి చెట్టును పూజిస్తే మోక్షంతో పాటు.. ఐశ్వర్యం .. సంపద రెట్టింపు అవుతుంది. ఇంకా జాతకంలో దోషాలు కూడా తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు బీ అలర్ట్: చిన్న సమస్యే అని లైట్ తీసుకుంటే.. అంతే సంగతి..!
ద్వాపర యగంలో శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించి.. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేశాడని దేవీ భాగవతం ద్వారా తెలుస్తుంది. ఉసిరి చెట్టు లక్ష్మీదేవి.. విష్ణుమూర్తిలకు నివాసంగా ఉంటుంది. ఆ రోజున ( ఫిబ్రవరి 27)న ఉసిరి చెట్టుకు నీరు పోయాలి. ఆ తరువాత ఆవనూనెతో దీపారాధన చేసి.. పసుపు.. కుంకుమ.. గంధంతో అలంకరించాలి. లక్ష్మీనారాయణులను పూజించి .. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఆవుపాలతో తయారు చేసి పాయసాన్ని నివేదించి.. ప్రదక్షిణలు చేయాలి. "ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః" మంత్రాన్ని జపించడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు చేకూరుతాయి. ఆర్థిక కష్టాలు ఉన్నవాళ్లు సైతం ఉసిరి చెట్టును పూజించడం ద్వారా ఆ కష్టాల నుంచి సులువుగా గట్టెక్కుతారని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అమలక ఏకాదశి రోజున దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. పసుపు రంగు వస్త్రాలను ధరించి ఉసిరికాయలను, ఇతర ఫలాలను దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
ఫాల్గుణ శుక్ల పక్ష ఏకాదశి తిథి ( 2026 ఫిబ్రవరి 27) నాడు ఆమ్ల వృక్షాన్ని పూజిం చేవారు తన అనుగ్రహాన్ని పొందుతారని చెప్పారు. అంతేకాదు ఈ రోజున ఉసిరిచెట్టు సమీపంలో లక్ష్మీదేవి, కుబేరుడు నివాసముంటారని ప్రతీతి. ఈ ఏకాదశి రోజున రాధాకృష్ణులు ఉసిరిచెట్టు కింద ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి.ఇలా చేస్తే జాతకాల్లో గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు
