ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ చేజారిన టాప్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ చేజారిన టాప్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌

దుబాయ్: టీమిండియా లెజెండరీ బ్యాటర్ రోహిత్ శర్మ  ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో నంబర్ వన్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను కోల్పోయాడు. మూడు వారాల పాటు టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగిన రోహిత్ బుధవారం విడుదలైన తాజా జాబితాలో రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ను వెనక్కి నెట్టి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.  వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సెంచరీ చేసిన అతను 782 రేటింగ్ పాయింట్లు సాధించి టాప్ ర్యాంక్ అందుకున్నాడు.  వన్డే బ్యాటర్లలో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన రెండో న్యూజిలాండ్ ఆటగాడిగా మిచెల్ రికార్డు సృష్టించాడు. 

గతంలో 1979లో కివీస్ లెజెండ్ గ్లెన్ టర్నర్ ఈ ఘనత సాధించారు. రోహిత్  కేవలం ఒక పాయింట్ తేడాతో (781) రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అఫ్గానిస్తాన్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇబ్రహీం జద్రాన్ రెండు నుంచి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు పడిపోగా..  ఇండియా బ్యాటర్లు శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (4వ), విరాట్ కోహ్లీ (5వ), శ్రేయస్ అయ్యర్ (8వ) టాప్‌‌‌‌‌‌‌‌–10లో నిలిచారు.  

వన్డే బౌలర్లలో అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నంబర్ వన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నాడు. టెస్టు బ్యాటర్లలో  సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి టాప్–-5లోకి ప్రవేశించాడు. శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ రెండు స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా తన టాప్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకోగా.. కుల్దీప్ యాదవ్  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ 13వ ర్యాంక్ సాధించాడు.  రవీంద్ర జడేజా 4 స్థానాలు మెరుగై 15వ  ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.