రజనీకాంత్ టైమ్స్ .. 50 ఏళ్ల సినీ సామ్రాజ్యానికి హిందుస్థాన్ టైమ్స్ అపూర్వ గౌరవం..

 రజనీకాంత్ టైమ్స్ .. 50 ఏళ్ల సినీ సామ్రాజ్యానికి హిందుస్థాన్ టైమ్స్ అపూర్వ గౌరవం..

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ఏకైక నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న  తలైవా.. తన అద్భుతమైన తటన , ఉత్కంఠభరితమైన స్టంట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించారు.  రజనీ  మూవీ వస్తుందంటే చాలు ఆ హడావిడియే వేరు. ఆఫీసులకు సెలవుల నుంచి .. సినిమా చూసే అభిమానుల కోసం స్పెషల్ విమానాలు ఏర్పాటు చేయడం చూశాం. కానీ ఇప్పుడు రజనీకాంత్ కోసం ఏకంగా ప్రముఖ దినపత్రిక తన మెయిన్ పేజీ పేరునే మార్చేసింది. ఇది ఆయనకు ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలియజేస్తోంది.

సాధారణంగా వివిధ కారణాలతో  వార్తల్లో నిలిచే రజనీకాంత్ కు మీడియా చారిత్రాత్మకమైన గౌరవాన్ని  తెలిపింది.  తలైవా సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకన్న సందర్భంగా హిందుస్థాన్ టైమ్స్,OTT play కలిసి గౌరవించాయి. . ఒక అపూర్వమైన ఘట్టాన్ని సృష్టించాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో  సహకారంతో , హిందుస్థాన్ టైమ్స్ తన 100 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా తన ముఖచిత్రాన్ని పూర్తిస్థాయిలో రజనీకాంత్ కు అంకితం చేసింది. ఇది ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. నవంబర్ 19న పేపర్ లో రజనీ ఫొటో చూసి పాఠకులు ఆశ్చర్యపోయారు. ఇది  తలైవాకు ఇచ్చిన గొప్ప గౌరవం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'హిందుస్థాన్ టైమ్స్' ఈ  రోజు ( నవంబర్ 19న ) పత్రిక పేరును  ( Masthead  ) మార్చి "రజనీకాంత్ టైమ్స్"గా ప్రకటించింది. ఈ నిర్ణయం సాధారణంగా ఒక మహత్తరమైన ఘట్టానికో లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశానికో మాత్రమే కేటాయించే పత్రిక తొలి పేజీని, ఒక వ్యక్తికి అంకితం చేయడం మీడియా చరిత్రలోనే ఒక అరుదైన సందర్భం. ఆ పత్రికలోని సంప్రదాయక తీవ్రత స్థానంలో, రజనీకాంత్ స్టైల్‌కు, ఐదు దశాబ్దాల పాటు పాప్ కల్చర్‌ను ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వానికి బోల్డ్ అండ్ విజువల్ ట్రిబ్యూట్ ఇచ్చారు. ఈ అపూర్వమైన ముద్రణా మాధ్యమానికే పరిమితం చేయకుండా, Fever FM రేడియో ద్వారా కూడా ఈ ఉత్సవాన్ని అభిమానులు, శ్రోతలు,  జీవితకాల 'తలైవా' అభిమానులకు చేరవేశారు. 

►ALSO READ | ఆ ఊరిలో కూర్చుని చూస్తున్నట్టుగా... రాజు వెడ్స్ రాంబాయి

ఈ బృహత్తర కార్యక్రమం వెనుక ప్రధానంగా OTTplay ఉంది. ఇది AI-ఆధారిత డిస్కవరీ ఇంజిన్ ద్వారా 30కి పైగా OTT సర్వీసులను ఒకే సబ్‌స్క్రిప్షన్‌లో అందిస్తుంది. లక్షలాది మంది రజనీకాంత్ అభిమానులకు, 'బాషా', 'ముత్తు', 'దళపతి' వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌తో పాటు, 'కబాలి', 'కాలా', 'పేట', 'జైలర్', 'వేట్టైయాన్', 'కూలీ' వంటి ఆధునిక బ్లాక్‌బస్టర్‌లను ఒకే చోట చూసేందుకు OTTplay ఒక స్ట్రీమింగ్ వేదికగా నిలిచింది. రజనీకాంత్ సినీ జీవితంలోని అన్ని యుగాలను ఒకేచోట చేర్చి, అభిమానులకు అది ఒక వర్చువల్ 'తలైవా' మందిరాన్ని సృష్టించింది. ఈ అద్భుతమైన మార్పు ద్వారా భారతీయ సినిమాపై రజనీకాంత్ ప్రభావం ఎంతటిదో మరోసారి ప్రపంచానికి చాటింది.