ఆ ఊరిలో కూర్చుని చూస్తున్నట్టుగా... రాజు వెడ్స్ రాంబాయి

ఆ ఊరిలో కూర్చుని  చూస్తున్నట్టుగా... రాజు వెడ్స్ రాంబాయి

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రం ‘రాజు వెడ్స్‌‌ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటీవీ విన్‌‌ నిర్మాత సాయికృష్ణ మాట్లాడుతూ ‘మిడిల్‌‌ క్లాస్‌‌కు కనెక్ట్ అయ్యేలా మన చుట్టూ జరుగుతున్న స్టోరీస్‌‌ను ఎక్కువగా ఈటీవీ విన్‌‌లో అందిస్తున్నాం. 

ఈ స్క్రిప్ట్‌‌ విన్నప్పుడు కూడా ఇది మన నేటివ్ స్టోరీ అనిపించింది.  కొన్ని సీన్స్‌‌ డెమో షూట్ చేశాక దర్శకుడిపై నమ్మకం కలిగింది.  సినిమా చూస్తున్నంతసేపు మనం ఒక ఊరిలో కూర్చుని చూస్తున్నట్లు ఉంటుంది. ఎక్కువ భాగం ఊరిలోనే షూటింగ్ చేశాం. దాదాపు అంతా కొత్తవాళ్లే మా సినిమాకు వర్క్ చేశారు. వంశీ నందిపాటి, బన్నీవాస్ గారి కాంబినేషన్‌‌లో  ‘లిటిల్ హార్ట్స్’ లాంటి మరో విజయం లభిస్తుందని నమ్ముతున్నాం’ అని చెప్పారు.