మార్కెట్ లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఎందుకో ఎక్కువమంది దీన్ని ఇష్టంగా తినరు కానీ... ఇందులో పోషకాలు లెక్కలేనన్ని. అబ్బా తోటకూరా అనేవాళ్లు దాని గురించి తెలుసుకుంటే మంచిది.
- బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్ గా తోటకూర తింటే బోలెడంత లాభం ఉంటుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. కొవ్వును తగ్గిస్తుంది.
- ఇన్స్టంట్ ఎనర్జీ కావాలంటే ఈ ఆకుకూరని మించింది లేదు. అయితే వేపుడు చేసుకుని తినేకంటే కూడా కూరలా వండుకుని తింటే పోషకాలు మెండుగా అందుతాయి. అలాగైతేనే అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.
- అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్టెన్షన్ తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది.
- తోటకూరలోని విటమిన్ ..సి రోగ నిరోధకశక్తిని
- పెంచుతుంది. ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది.
- తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్ గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది.
- క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం ఖనిజాలు తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచుతుంది. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి.
- ఒక్కమాటలో చెప్పాలంటే విటమిన్ల గని తోటకూర అనొచ్చు. విటమిన్ ఎ, సి, డి, ఇ, కె. విటమిన్ బి12, బి6 ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి.
- వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.
వెలుగు,లైఫ్
