జనగామలో వాట్సాప్ చాట్ బాట్ లోనూ కరెంట్ కంప్లయింట్స్

జనగామలో వాట్సాప్ చాట్ బాట్ లోనూ కరెంట్ కంప్లయింట్స్

డిజిటల్​సేవలపై విద్యుత్​శాఖ స్పెషల్​ఫోకస్​పెట్టింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కసరత్తు చేపట్టారు. టీజీఎన్​పీడీసీఎల్​ యాప్​పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. యాప్ లోని 20  సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. చాట్​బాట్​వాట్సప్​ ఫీచర్​లోనూ సేవలు అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ మొబైల్, ఐఫోన్ లో  ప్లే స్టోర్ లో యాప్​డౌన్​లోడ్​చేసుకుని సేవలు పొందాలని అధికారులు సూచిస్తున్నా రు. 

ఇందులో రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్,  కన్స్యూమర్ గ్రీవెన్సెస్ ( కంప్లైంట్ స్టేటస్,  రి  ఓపెన్  కంప్లైంట్),  సెల్ఫ్ రీడింగ్,  పే బిల్స్,  బిల్ హిస్టరీ,  ఆన్ లైన్ పేమెంట్ హిస్టరీ,  లింక్ ఆధార్, మొబైల్,  డొమెస్టిక్ బిల్ క్యాలిక్కులేట ర్,  కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి, పేరు, లోడ్ మార్పు,  పవర్ కన్​జంప్షన్ గైడ్ లైన్స్, టారిఫ్ డిటెయిల్స్,  ఎనర్జీ సేవింగ్, సేఫ్టీ టిప్స్,  ఫీడ్ బ్యాక్,  మై అకౌంట్,  కస్టమర్లకు బిల్లు సమాచారం,  ఏరియాకు చెందిన అధికారి వివరాలు,  కాంటాక్ట్  ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చినట్లు చెబుతున్నారు. 

సులువుగా కొత్త సర్వీసులు 

 ​ 
డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా  కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అప్లికేషన్లలో చిన్న లోపాలు ఉంటే రిజెక్ట్​ చేయకుండా మరో చాన్స్  కల్పిస్తున్నా రు. అప్లికేషన్​ నమోదు నుంచి సర్వీసు రిలీజ్ వరకు ప్రతి దశలో మొబైల్​కు మెసేజ్​పంపిస్తున్నారు. 

దాని ఆధారంగా సంబంధిత పత్రాలు దరఖాస్తు దారుడు అప్ లోడ్ చేస్తే  త్వరగా పరిష్కరించి కనెక్షన్ మంజూరు చేస్తున్నారు. వినియోగదారుడు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు కొత్తగా ట్రాకింగ్ సుదుపాయం కూడా ఉంది. అప్లికేషన్ నంబర్ తో tgnpdcl.com వెబ్‌సైట్ నుంచి లేదా tgnpdcl  మొబైల్ యాప్ ద్వారా వివిధ దశల్లో దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు.

వాట్సాప్ చాట్ బాట్ లోనూ కంప్లయింట్  

విద్యుత్​సరఫరా వంటి సమస్యలను వాట్సప్​ చాట్​బాట్​ద్వారా కూడా పరిష్కరించుకునే సదుపాయం  కల్పించారు. మొబైల్ నుంచి వాట్సాప్ లో 7901628348 నంబర్ కు హాయ్ అని చాట్ చేస్తే హాయ్ టీజీఎన్​పీడీసీఎల్​కాల్ సెంటర్ కు స్వాగతం అని, రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. రిజిస్టర్ కంప్లైంట్ ఎంటర్ చేస్తే విత్ యూనిక్ సర్వీస్ నంబర్,  విత్అవుట్ యూనిక్ సర్వీస్ నంబర్,  ప్రీవియస్ మెను వస్తుంది. ఇలాంటి వివరాలు అందుబాటులో ఉండగా..  ఓకే చేయగానే కంప్లైంట్ మెనూలో కనిపిస్తాయి. అందులో కంప్లైంట్ కు చెందిన సబ్ టైప్ లేదా చాట్ విత్ ఏజెంట్ వస్తుంది. 

అనంతరం చాట్ చేయొచ్చని, కంప్లైంట్ నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీనంబర్ ను సంప్రదించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. రైతులకు సులువుగా అర్థమయ్యేందుకు  వ్యవసాయ కనెక్షన్​ఎస్టిమేట్ కాపీలు తెలుగులో అందిస్తున్నారు. ఎస్టిమేట్​మెటీరియల్స్  వివరాలు, స్కెచ్ (నక్ష) మొబైల్​కు మెసేజ్​వస్తుందని, లింక్​ఓపెన్​ చేసి స్టేటస్​ తెలుసుకోవచ్చని అధికారులు వివరిస్తున్నారు.  

డిజిటల్​ సేవలను సద్వినియోగం చేసుకోండి 

విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు డిజిటల్​సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. టీజీఎన్​పీడీసీఎల్​యాప్​లో 20 రకాల సేవలు ఉన్నాయి. వాట్సప్​ చాట్​బాట్​ద్వారా కూడా సమస్యలపై ఏజెంట్​తో చాట్​చేసి పరిష్కరించుకోవచ్చు. లేదంటే  1912 టోల్​ ఫ్రీ నంబర్​కు కూడా కాల్​చేసి తెలుసుకోవచ్చు. 
- టి. వేణుమాధవ్, ఎస్ఈ, టీజీఎన్​పీడీసీఎల్, జనగామ