రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏంటి ? ఆర్‌‌‌.కృష్ణయ్య ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏంటి ? ఆర్‌‌‌.కృష్ణయ్య ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సమాజాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతం అమలు చేస్తామని కేబినెట్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయించడంపై మండిపడ్డారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తు ఉండదని, అలాంటప్పుడు పార్టీ ప్రతిపాదికన 42 శాతమని ఎలా అంటారని ప్రశ్నించారు. బుధవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బిహార్ ఎన్నికల వరకు ఆగి, ఎన్నికల ఫలితాలు రాగానే కాంగ్రెస్ పార్టీ అసలు నిజ రూపం బయటపడిందని విమర్శించారు. 

గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు 22 శాతానికి తగ్గించి ఎన్నికలకు పోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని నిలదీశారు. ఒకవైపు హైకోర్టులో కేసు నడుస్తుండగా, తీర్పు రాకముందే ఎన్నికలకు ఎందుకెళ్తున్నారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అఖిలపక్షంతో ప్రధాన మంత్రిని కలవకపోవడానికి కారణం ఏంటని నిలదీశారు. బిహార్ ఓట్ చోరీ అంటూ నెలరోజుల పాటు పార్లమెంటును స్తంభింపచేసిన ఇండియా కూటమి.. బీసీల కోసం 4 రోజులు సభను ఎందుకు స్తంభింపజేయలేదని ప్రశ్నించారు.