బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని, అప్పటివరకు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికలు ఆపకుంటే రాష్ట్రంలో అగ్గిపుట్టి మండుతుందని హెచ్చరించారు. 

బుధ వారం ఆయన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని లోయర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్ వద్దనున్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చెప్పిన “ఎవరి వాటా వారికి” అనే మాటలు తెలంగాణలో నీటి మూటలయ్యాయని విమర్శించారు. 

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఇవ్వాల్సిన కిషన్ రెడ్డి, రామచంద్ర రావులే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష బృందంతో ప్రధానిని కలిసి బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి తేవాలని  డిమాండ్ చేశారు.