హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్లు కల్పించారు. ఒకేసారి 130 మందికిపైగా పదోన్నతులు కల్పించడంపై తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో ఉన్న పంచాయతీరాజ్ కమిషనరేట్ ఆఫీసులో పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజనను కలిసి వారు కృజ్ఞతలు తెలిపారు. అదనపు కమిషనర్రవిందర్, డిప్యూటీ కమిషనర్విద్యాలతకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్ఎంఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి నందకుమార్, వైస్‌ప్రెసిడెంట్ అనంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలి
రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ రాష్ట్ర అధక్షుడు మధుసూదన్ రెడ్డి కోరారు.బుధవారం టీపీఎస్ఏ నాయకులు పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజనను కలిసి వినతి పత్రం అందించారు. దీనికి డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఓపీఎస్‌ల వేతనాలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేడర్ స్ట్రెంత్ పై నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు పేర్కొన్నారు.
