ఢిల్లీ: బిల్లుల ఆమోదానికి గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్ధిష్ట గడువు విధించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గడువు విధించడం అధికారాల విభజనను తుంగలో తొక్కడమేనని వ్యాఖ్యానించింది.
బిల్లుల విషయంలో గవర్నర్‌కు 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయని గుర్తుచేసింది. బిల్లు ఆమోదం, అసెంబ్లీకి తిరిగి పంపడం, రాష్ట్రపతికి పంపటమే గవర్నర్ ముందు ఉన్న 3 ఆప్షన్స్ అని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు అధికారాలు కాకుండా నాలుగో అధికారం గవర్నర్‌కు లేదని సుప్రీంకోర్టు చెప్పింది.
ఆర్టికల్ 200 కింద గవర్నర్ ముందు నాలుగో ఆప్షన్ లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. బిల్లులను సుదీర్ఘ కాలం పెండింగ్‌లో పెట్టడం సరికాదని సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం అభిప్రాయపడింది. పున:పరిశీలనకు పంపకుండా నిలిపివేయడం సమాఖ్య వాదాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవని, రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో తమ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పేసింది.
