కార్తీకమాసం ఈ ఏడాది నవంబర్20 వ తేదితో ముగిసింది. ఆ తరువాత రోజునుంచి ( 2025 నవంబర్ 21) నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం మార్గశిర పాడ్యమి రోజును( 2025 నవంబర్ 21 ) పోలి పాడ్యమి అంటారు. ఈ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అమ్మవారికి పూజలు చేసి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదలాలని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసం తరువాత.. మార్గశిర మాసం పోలి స్వర్గం పుణ్యతిథితో ప్రారంభమవుతుంది. ఈ రోజన ( 2025 నవంబర్ 21) మహిళలకు చాలా ప్రత్యేకమని స్కంధ పురాణం ద్వారా తెలుస్తుంది. మహిళలు తెల్లవారుజామున చెరువులు లేదా నదులలో దీపాలు వదులుతారు. దీపదానం చేస్తారు. సాధారణంగా ఈ పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపాలు వెలిగిస్తారు.
ముఖ్యంగా అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అనంతరం మూడు సార్లు నీటిని చేతులతో తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథ వింటారు. ఈ నేపథ్యంలో పోలి పాడ్యమి 2025 తేదీ.. పోలి స్వర్గం 2025 పూజా విధానం గురించి తెలుసుకుందాం..
కార్తీక మాసం అంతా శివకేశవుల ఆరాధన, నదీ స్నానాలు, పూజలు, నోములతో సందడిగా గడిచిపోయింది. అయితే.. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలి పాడ్యమిగా జరుపుకుంటారు.
ఈ ఏడాది పోలి పాడ్యమి 2025 తిథి నవంబర్ 20వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమయింది. మరుసటి రోజు అంటే నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్న రోజు పోలి పాడ్యమి జరుపుకోవాలి కాబట్టి నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజు పోలి పాడ్యమి 2025 జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
పోలి స్వర్గం పూజ విధానం
తెల్లవారుజామునే మహిళలు నదులు లేదా చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. అనంతరం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వాళ్లు పోలి పాడ్యమి రోజున 30 వత్తులతో దీపాలను వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ పోలి పాడ్యమి రోజున 30 వత్తులతో దీపం వెలిగించి పారే నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది ఈ రోజున అరటి దొప్పలలో దీపాలు వెలిగించి పారే నీటిలో అంటే ప్రవహించే నదీ జలాలలో లేదా కాలువల్లో వదులుతారు. అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని చేతులతో ముందుకు తోస్తూ నమస్కరించుకుని.. ఆ తర్వాత పోలి స్వర్గం కథను విని అక్షింతలు వేసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
