ప్రపంచ క్రిప్టో మార్కెట్ తాత్కాలిక క్రాష్‌ను చూస్తున్నాయి. దీంతో కొన్ని వారాల కిందట జీవితకాల గరిష్ఠాలను తాకిన బిట్ కాయిన్ ప్రస్తుతం 90వేల డాలర్ల దిగువకు జారుకుంది. దీంతో భారత పెట్టుబడిదారులు దీన్ని పెట్టుబడికి అవకాశంగా మలచుకున్నారు. నవంబర్ 18న బిట్‌కాయిన్ ధర 7 నెలల తర్వాత మొదటిసారిగా 90వేల డాలర్ల కంటే కిందికి జారింది. ఈ సమయంలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాల లిక్విడేషన్ నమోదైంది.
అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాల జోరును చూస్తుంటే.. భారత క్రిప్టో ఎక్స్చేంజీలలో మాత్రం కొనుగోళ్లు పెరిగాయి. నవంబర్ 18న దాని మొత్తం రిటైల్ ట్రేడింగ్ వాల్యూమ్‌లో బిట్‌కాయిన్ వాటా 40 శాతానికి చేరిందని కాయిన్ స్విచ్ ప్రకటించింది. రూ. 5 లక్షలకు పైగా విలువైన బిట్‌కాయిన్ కలిగి ఉన్న “బిగ్ బయ్యర్లు” తమ హోల్డింగ్స్‌ను 15–20% పెంచుకున్నారని జియోటస్ ఎక్స్ఛేంజీ ప్రకటించింది. తమ రోజువారీ ట్రేడింగ్ వాల్యూమ్‌లను 10–23 మిలియన్ డాలర్ల మధ్య ఉందని కాయిన్ డీసీఎక్స్ వెల్లడించింది.
క్రిప్టోలపై నిపుణుల మాట..
* అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి, ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం, పెద్ద పెట్టుబడిదారుల పొజిషన్‌ల తగ్గింపు వంటి అంశాలతో బిట్‌కాయిన్ తాత్కాలికంగా పడిపోయిందని CoinSwitch సహస్థాపకుడు అశీష్ సింగ్‌హాల్ అన్నారు. ఇది మార్కెట్లో తాత్కాలిక స్థిరత్వం లోపం మాత్రమేనని అభిప్రాయపడ్డారు.
* ఓలటిలిటీ ఉన్న రోజుల్లో కూడా ట్రేడింగ్ వాల్యూమ్ పెరగడం, పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గలేదని సూచిస్తోందని CoinDCX సహస్థాపకుడు సుమిత్ గుప్తా చెప్పారు.
* ఇప్పటి క్రిప్టో పెట్టుబడిదారులు 2017 లేదా 2021 సైకిళ్ల సమయంలో ఉన్నట్టు భావోద్వేగపూర్వకంగా కాకుండా వ్యూహాత్మకంగా స్పందిస్తున్నారని జియోటస్ సహ స్థాపకుడు విక్రమ్ సుబ్బురాజ్ తెలిపారు. చాలా మంది SIPలు, హాల్వింగ్ సైకిల్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై అవగాహనతో పెట్టుబడి చేస్తున్నారన్నారు.
మెుత్తానికి ప్రస్తుతం కొనసాగుతున్నది తాత్కాలిక బుల్ ట్రెండ్ కరెక్షన్ మాత్రమేనని నిపుణులు సూచిస్తున్నారు. గత ఐదు వారాల్లో గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.2 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గింది. అయినప్పటికీ భారత పెట్టుబడిదారులు “డిప్‌లో బై” మైండ్‌సెట్‌తో బిట్‌కాయిన్‌పై నమ్మకాన్ని కొనసాగించటం గమనార్హం.
