ఒంటరి వృద్దులకు అండగా ‘సాథి’...

ఒంటరి వృద్దులకు అండగా ‘సాథి’...
  • ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హరిచందన

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒంటరి వృద్ధులకు ‘సీనియర్ సాథి’ అన్ని విధాలా అండగా ఉంటుందని హైదరాబాద్ ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దివ్యాంగులు,- వయోవృద్ధుల సంక్షేమ శాఖ, యంగిస్తాన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ‘సీనియర్ సాథి’ కార్యక్రమాన్ని కలెక్టర్ హరిచందనతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. వృద్ధుల ఒంటరితనాన్ని పోగొట్టి, తరాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. 

యువత వృద్ధులకు అండగా నిలవాలని, రోజురోజుకూ కల్చర్,  కమ్యూనిటీ వాల్యూస్ తగ్గిపోతున్నాయని, వృద్ధుల అనుభవాలు, విలువలు తప్పక పంచుకోవాలని కలెక్టర్ కోరారు. హైదరాబాద్ లో వృద్ధులపై డైకేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అసిస్టెంట్ డైరక్టర్ రాజేందర్,   పార్థసారథి, సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు.