కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో ‘కేరళ లక్కీ డ్రా’ పేరుతో వచ్చిన వీడియో చూసి మోసపోయాడు. మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. యూట్యూబ్‌లో వీడియో చూసి రూ.20 ఫోన్‌పే ద్వారా చెల్లించి లాటరీ టికెట్ కొన్నాడు.
అనంతరం బాధితుడి వాట్సాప్‌కు రూ.5లక్షలు గెలుచుకున్నావని, ప్రాసెస్ ఫీజు కింద రూ. 4,999 చెల్లించాలని సూచించారు. ఇలా ఆరు విడతలుగా రూ. 56,299 చెల్లించాడు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
