ట్యాంక్ బండ్, వెలుగు: అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్ లో ప్రమాదవశాత్తు మహిళా ఉద్యోగి కాలు ఇరుక్కున్న ఘటన సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ ఎంట్రెన్స్ వద్ద బుధవారం జరిగింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది స్కానర్ గ్రిల్ ను కట్ చేసి ఆమెను కాపాడారు. ఈ ఘటనతో కాసేపు బాధితురాలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
