రంగసముద్రంలో భారీ కొండచిలువ

రంగసముద్రంలో భారీ కొండచిలువ

వనపర్తి, వెలుగు:శ్రీరంగాపూరు మండల కేంద్రంలోని  రంగసముద్రం రిజర్వాయరులో బుధవారం జాలరుల వలలో భారీ కొండచిలువ చిక్కింది. రిజర్వాయరులో   గేట్ల వద్ద మత్స్యకార్మికుల   వలకు  చిక్కుకుపోయింది. వలలో చేపలు పడ్డాయో లేదో చూడడానికి వెళ్లిన మత్స్యకార్మికులకు  ఈ భారీ కొండచిలువ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు గ్రామస్థులను పిలిచి అతికష్టం మీద కొండచిలువను పట్టుకుని బంధించారు. అనంతరం అటవీశాఖ వారికి అప్పగించగా దాన్ని వారు అడవిలో వదిలిపెట్టారు.