హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులు 2018 కంటే ముందు ప్రమోషన్ పొందినవారికి10 శాతం కోటా కింద సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉండగా.. ఏడు జోన్లలో అర్హులైన 9 మందికి పదోన్నతి కల్పించారు.
