మార్కెట్ యార్డులో సకల సౌకర్యాలు..సీసీ రోడ్ల నిర్మాణం, రైతులకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు

మార్కెట్ యార్డులో సకల సౌకర్యాలు..సీసీ రోడ్ల నిర్మాణం, రైతులకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు

పరిగి, వెలుగు: మార్కెట్​యార్డుల్లో రైతులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్​రెడ్డి అన్నారు. బుధవారం పరిగి మార్కెట్​ యార్డులో రూ.1.98 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కెట్​ యార్డులో సీసీ రోడ్ల నిర్మాణం, రైతులకు విశ్రాంతి భవనాలు, విద్యుత్​ వసతి, అన్నపూర్ణ క్యాంటీన్, వేబ్రిడ్డి నిర్మాణ పనులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్​ కమిటీ చైర్మన్​ పరశురాంరెడ్డి, వైస్​ చెర్మన్​ అయూబ్, ఆత్మ కమిటీ చైర్మన్​ మంచన్​పల్లి శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.