హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ను సమర్థించడం దేశ ద్రోహమే: మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ను సమర్థించడం దేశ ద్రోహమే: మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • కాంగ్రెస్​పై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: హిండెన్‌‌‌‌బర్గ్ రిపోర్ట్‌‌‌‌ను సమర్థించడమంటే దేశానికి ద్రోహం  చేయడమేనని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ రిపోర్టు ఆధారంగా సెబీ చీఫ్‌‌‌‌పై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌‌‌‌ నాయకులు ధర్నా చేయడంపై ఆయన విమర్శలు గుప్పించారు. హిండెన్‌‌‌‌బర్గ్ అనేది విదేశీ సంస్థ అని, ఆ సంస్థకు కాంగ్రెస్‌‌‌‌ మౌత్‌‌‌‌పీసుగా మారిందని దుయ్యబట్టారు.

 ఈ మేరకు గురువారం మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.  దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపర్చాలని హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ సంస్థ ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నానికి కాంగ్రెస్ వత్తాసు పలుకుతోందన్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు.