V6 News

బీజేపీ క్యాంపెయిన్: 100 ప్రెస్ కాన్ఫరెన్స్​లు.. 700 రైతు సభలు

బీజేపీ క్యాంపెయిన్: 100 ప్రెస్ కాన్ఫరెన్స్​లు.. 700 రైతు సభలు

అగ్రి చట్టాలపై రైతుల ఆందోళనల విషయంలో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. కొత్త చట్టాలతో రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించేందుకు 700 జిల్లాల్లో రైతులతో 700 మీటింగ్​లు, 100 ప్రెస్​ కాన్ఫరెన్స్​లను ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో కేబినెట్​ మినిస్టర్లు కూడా పాల్గొంటారు, రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చుతారని సమాచారం. రైతులకు మేలు చేసేందుకే కేంద్రం వీటిని తీసుకొచ్చిందని ప్రచారం చేయనున్నారు.