V6 News

ఒకప్పుడు యూట్యూబర్తో రిలేషన్.. ప్రస్తుతం IPL ఆటగాడితో ప్రేమాయణం.. ఎవరీ సమ్రీన్ కౌర్?

ఒకప్పుడు యూట్యూబర్తో రిలేషన్.. ప్రస్తుతం IPL ఆటగాడితో ప్రేమాయణం.. ఎవరీ సమ్రీన్ కౌర్?

పంజాబీ మోడల్, నటి సమ్రీన్ కౌర్ (Samreen Kaur) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్తో ఆమె డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల అర్ష్‌దీప్ స్నాప్‌చాట్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు డేటింగ్ రూమర్లకు కారణమయ్యాయి.

ఆ ఫోటోలలో అర్ష్‌దీప్ సింగ్ ఒక యువతితో చేతులు పట్టుకుని కనిపించాడు. అభిమానులు టాటూలు, యాక్సెసరీస్ ఆధారంగా ఆ యువతి సమ్రీన్ కౌర్ అని గుర్తించారు. అంతేకాకుండా, ఐపీఎల్ మ్యాచ్‌లకు ఈ బ్యూటీ తరచూ హాజరుకావడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

ఎయిర్‌పోర్ట్ & గురుద్వారాలో కలిసి.. 

ఇటీవల చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఇద్దరూ కలిసి కనిపించడం మరింత చర్చకు దారి తీసింది. నవ్వుకుంటూ, స్నేహంగా గడుపుతూ కనిపించిన వీరిద్దరూ గురుద్వారాను కూడా కలిసి సందర్శించినట్లు సమాచారం. వైరల్ అవుతున్న ఫోటోలు & వీడియో పరిశీలిస్తే..

అర్ష్‌దీప్ ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాను సందర్శించి, ఆ పర్యటనకు సంబంధించిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దాదాపు అదే సమయంలో, సమ్రీన్ కౌర్ కూడా అచ్చం అలాంటి ఫోటోనే పోస్ట్ చేసింది. అలా వారిద్దరూ కలిసే గురుద్వారాని విజిట్ చేశారనే ఊహాగానాలు అభిమానులలో మరింత పెరిగాయి.

అంతకుముందు, ఈ జంట చండీగఢ్ విమానాశ్రయంలో కూడా కనిపించటంతో పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. మొత్తానికి, వీరిద్దరూ ఒకేలాంటి పోస్టులు పెట్టడం వల్ల, తమ రిలేషన్ని బయటపెడుతున్నారని క్రికెట్ లవర్స్ అంటున్నారు. 

వాంఖడే స్టేడియంలో స్పాట్..

ఏప్రిల్ 16న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు సమ్రీన్ హాజరై అర్ష్‌దీప్‌కు మద్దతు తెలిపింది. మ్యాచ్ తర్వాత కూడా స్టేడియం బయట కూడా ఈ బ్యూటీ కనిపించడంతో మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే వీరిద్దరి రిలేషన్ షిప్పై రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 

►ALSO READ | తప్పుడు రైలు ఎక్కితే దిగిపోవడమే మేలు.. విడాకులపై హన్సిక సంచలన వ్యాఖ్యలు!

మొత్తానికి అర్ష్‌దీప్ సింగ్-సమ్రీన్ కౌర్ మధ్య రిలేషన్‌పై అధికారిక ప్రకటన లేకపోయినా, వీరి కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. నిజంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారా? లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

అశీష్ చంచ్లానితో రిలేషన్?

గతంలో యూట్యూబర్ అశీష్ చంచ్లానితో నటి సమ్రీన్ రిలేషన్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే, తాము కేవలం మంచి స్నేహితులమే ఈ జంట అని చెప్పుకొచ్చింది. ఆతర్వాత ఇద్దరూ కలిసి కనిపించకపోవడంతో రూమర్స్ మరింత పెరిగాయి.

అయితే, వీరి బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్ వర్గాల్లో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన సమ్రీన్, తమ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉందని, ఇంకేం లేదని స్పష్టం చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MrBest (@mr.best748)

ఎవరు సమ్రీన్ కౌర్?

సమ్రీన్ కౌర్ 2001లో జమ్మూ & కాశ్మీర్‌లో జన్మించింది. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ర్యాంప్ వాక్స్, టీవీ యాడ్స్ ద్వారా గుర్తింపు పొందింది. 2018లో18 ఫెమినా మిస్ ఇండియాలో జమ్మూ & కాశ్మీర్ తరఫున ఫైనలిస్ట్‌గా నిలిచింది.

ముఖ్యంగా, కపిల్ దేవ్ నాయకత్వంలోని 1983 వరల్డ్ కప్ విజయం ఆధారంగా తెరకెక్కిన ‘83‌’ సినిమాలో కూడా ఆమె ఒక పాత్రలో నటించారు. అలాగే పంజాబీ చిత్ర పరిశ్రమలో పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలు, సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samreen (@samreenkaur__)