పోటీ నుంచి తప్పుకున్న బారాబంకీ బీజేపీ అభ్యర్థి

పోటీ నుంచి తప్పుకున్న బారాబంకీ బీజేపీ అభ్యర్థి

బారాబంకీ(యూపీ): ఉత్తరప్రదేశ్‌‌లోని బారాబంకీ లోక్​సభ స్థానం బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన ఆ పార్టీ సిట్టింగ్‌‌ ఎంపీ ఉపేంద్ర సింగ్‌‌ రావత్‌‌ పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఒక మహిళతో ఆయన కలిసి ఉన్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​అవుతున్నది. అయితే, అది ‘డీప్​ ఫేక్’ టెక్నాలజీతో సృష్టించిన వీడియో అని ఎంపీ ట్వీట్​ చేశారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. 

ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేయించాలని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కూడా కోరినట్లు చెప్పారు. అలాగే, నిర్దోషిగా తేలే వరకూ ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని రావత్​ స్పష్టం చేశారు. బీజేపీ ప్రకటించిన 195 మంది అభ్యర్థుల లిస్ట్​లో రావత్‌‌ పేరు కూడా ఉన్నది. అయితే తాజా వీడియో నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు రావత్​ ప్రకటించారు.