ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలి

ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలి

కరోనా బిల్లుల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులన్నింటిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలిని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. నరేష్ కుమార్ కరోనాతో మృతి చెందడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఆయన అన్నారు. డా. నరేష్ కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘ఒక జిల్లా వైద్యాధికారికి కూడా సరైన వైద్యం అందించలేకపోవడం చాలా దురదృష్టకరం. ఒక జిల్లా వైద్యాధికారి కుటుంబాన్ని సైతం యశోదా ఆసుపత్రి లక్షల రూపాయల బిల్లులు చెల్లించమని వేధించడం చాలా ఘోరం. ప్రజలను కరోనా నుండి కాపాడడానికి ప్రాణ త్యాగం చేసిన నరేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కేంద్రం అందించే 50 లక్షల భీమాకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. నరేష్ భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి. కరోనా పేరుతో భయపెట్టి ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూల్ చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోని.. ప్రజలకు భరోసా కల్పించాలి’ అని ఆయన అన్నారు.

For More News..

సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ

తెలంగాణలో మరో 1256 కరోనా కేసులు

కేరళ విమాన ప్రమాదం తర్వాత మళ్లీ మొదలైన వందే భార‌త్ మిష‌న్