మోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం

మోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం

కేసీఆర్ కు చైనా మీద ప్రేమ పెరిగిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సైనికులు విరోచితంగా పోరాడుతుంటే..కేసీఆర్ సోయిలేకుండా మాట్లాడుతుండన్నారు. సైనికులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడన్నారు. సర్జికల్ స్ట్రైక్ జరిగింది వాస్తవమన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తే రాహుల్ గాంధీ, కేసీఆర్ తప్ప అందరు సంబురాలు చేసుకున్నారన్నారు.  కేసీఆర్ ఏదేశానికి వత్తాసు పలుకుతున్నారన్నారు.  కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే కామెడీ అయిపోయిందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై మసూద్ అజర్ చెప్తే కేసీఆర్ నమ్ముతారా అని ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని  మోడీ స్పష్టమైన స్టేట్ మెంట్  ఇచ్చారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని పాకిస్తానే ఒప్పుకుందన్నారు.

ముఖ్యమంత్రిగా భారతదేశంపై గౌరవం ఉంటే కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. సైనికులను కించపరిచిన కేసీఆర్ దేశంలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ లాంటి మూర్ఖుడిని క్షమించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను దేశం మొత్తం ఖండిస్తుందన్నారు. 10 జెన్ పథ్ స్క్రిప్ట్ ను కేసీఆర్ చదువుతున్నారన్నారు.  రాఫెల్ డీల్ పై సుప్రీం కోర్టే క్లీన్ చీట్ ఇచ్చిందన్నారు. కేసీఆర్ దేశ ప్రధాని మీద, త్రివిధ దళాధిపతుల మీద, సుప్రీం కోర్టుల మీద కూడా నమ్మకం లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పునే తప్పుబడతున్నారన్నారు.కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండో అర్థం కాలేదన్నారు.  సంచలనాల కోసమే కేసీఆర్ మాట్లాడుతున్నాడన్నారు.

నంబర్ వన్ అవినీతిపరుడు కేసీఆరేనన్నారు బండి సంజయ్.  అవినీతి లేని పాలన దేశంలో మోడీదేనన్నారు. కరోనా సమయంలో ఆత్మనిర్భర భారత్ కింద రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని మోడీ ప్రకటించడం కేసీఆర్  కు నచ్చ లేదన్నారు. లబ్ధిదారులకు నేరుగా పైసలు ఇస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతుండన్నారు. ఒక్క రూపాయి కమీషన్ కూడా అందడం లేదనే డిఫ్రెషన్ లో ఉన్నాడన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టొద్దని కేంద్రం జనవరి 3, 2022 న అన్ని రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్ పంపించిందన్నారు.  దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. కేసీఆర్ కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కేసీఆర్ ఏప్రిల్ లో కరెంట్ బిల్లులు పెంచబోతున్నారన్నాని బండి సంజయ్ అన్నారు. కేంద్రం పేరు చెప్పి కేసీఆర్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో విద్యుత్ బిల్లులు పెంచినా..మోటార్ల దగ్గర మీటర్లు పెట్టినా..కేసీఆర్ కు మీటర్ పెట్టడం గ్యారంటీ అని హెచ్చరించారు. డిస్కలంకు కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ రూ. 48 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఫ్రీ కరెంట్ కేసీఆర్ ఇవ్వడం లేదని.. రైతుల పేరిట దోచుకుంటున్నాడన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కమ్యునిస్టులను కలిశాక సీఎం కేసీఆర్ కు చైనా మీద ప్రేమ పెరిగిందన్నారు.