పరివార్ వ్యాఖ్యలు హాస్యాస్పదం : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. రాంచందర్ రావు

పరివార్ వ్యాఖ్యలు హాస్యాస్పదం : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: దేశంలో భవిష్యత్తు రాజకీయ పోరు గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నడిపే కుటుంబ స్వార్థ రాజకీయాలకు, సంఘ్ పరివార్ నమ్మిన నిస్వార్థ దేశభక్తికి మధ్య ఉన్న తేడాను ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

కాంగ్రెస్‌‌‌‌కు రాజకీయం అంటే ఒకే కుటుంబంతో మొదలై, ఆ కుటుంబంతోనే ముగుస్తుందని.. కానీ, తమ సిద్ధాంతం నేషన్ ఫస్ట్ అని ఆయన స్పష్టం చేశారు. దేశంపై ఎమర్జెన్సీ రుద్ది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దని, 1984లో వేలాది మంది సిక్కులను ఊచకోత కోసింది ఆ పార్టీ పాలనలోనేనని ఆయన గుర్తుచేశారు.