
ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయనానికి బీజేపీ ఏర్పాటుచేసిన అధ్యయన కమిటీ తన పనిని మొదలుపెట్టింది. ఈ కమిటీ సమావేశం గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. దీనికి కమిటీ కన్వీనర్, ఎంపీ అర్వింద్, సభ్యులు వివేక్ వెంకటస్వామి, స్వామి గౌడ్, ప్రకాశ్ రెడ్డి, బాబీ అజ్మీరా, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన టీఆర్ఎస్ వైఫల్యాల గురించి ఈసందర్భంగా కూలంకషంగా చర్చించారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే పార్టీ మూడు కీలక కమిటీలను నియమించింది. ఈటల రాజేందర్ కన్వీనర్ గా ‘చేరికలపై సమన్వయ కమిటీ’ని, జితేందర్‌రెడ్డి కన్వీనర్ గా ‘ఫైనాన్స్ కమిటీ’ని, ధర్మపురి అర్వింద్ కన్వీనర్ గా ‘ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ’ని ఏర్పాటు చేశారు.