జీహెచ్ఎంసీ ఆఫీసర్పై బీజేపీ కార్పొరేటర్ దాడి..ఆందోళనకు దిగిన ఉద్యోగులు

జీహెచ్ఎంసీ ఆఫీసర్పై  బీజేపీ కార్పొరేటర్ దాడి..ఆందోళనకు దిగిన ఉద్యోగులు

హైదరాబాద్ జాంభాగ్  బీజేపీ కార్పొరేటర్  రాకేష్ జైశ్వాల్ సహనం కోల్పోయారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 14లో సెక్షన్ ఆఫీసర్  నరేష్ పై చైయి చేసుకున్నారు.  టౌన్ ప్లానింగ్ ఏసీపీ ముందే సెక్షన్ ఆఫీసర్ పై దాడి చేశారు కార్పొరేటర్. 

దీంతో విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు జీహెచ్ఎంసీ ఉద్యోగులు . ఒక ప్రభుత్వ అధికారి పై కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారని నిలదిస్తున్నారు తోటి ఉద్యోగులు. సర్కిల్ 14కి తాళం వేసి ఆందోళన చేస్తున్నారు ఉద్యోగులు.. కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 అయితే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు జీహెచ్ఎంసీ ఉద్యోగులకు  సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ కార్పొరేటర్ పై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని చెప్పారు.