అధికారం కోల్పోయాకా బీఆర్ఎస్కు కార్యకర్తలు గుర్తొచ్చారా : రఘునంధన్ రావు

అధికారం కోల్పోయాకా బీఆర్ఎస్కు కార్యకర్తలు గుర్తొచ్చారా : రఘునంధన్ రావు

బీఆర్ఎస్ పార్టీ పై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునంధన్ రావు విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోయాకా బీఆర్ఎస్కు కార్యకర్తలు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటోన్న కేటీఆర్..శంకరమ్మ విషయంలో మీరు ఇచ్చిన మాట గుర్తు లేదా అని నిలదీశారు.
అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నెలకు రాసి అసలైన ఉద్యమకారులకు అవకాశం ఇస్తామని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాఘునంధన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్, పోచమ్మసాగర్ తో బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. త్యాగం చేసిన కుటుంబాలకు సీట్ల అవకాశం ఇస్తామని చెప్పే దమ్ము,దైర్యం బీఆర్ఎస్ కు ఉందా? అని ప్రశ్నించారు. పొత్తు కుదరదని మోదీ చెప్పిన రోజే.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య  తెగతెంపులు అయ్యాయని చెప్పారు.

తెలంగాణా సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నీ బొంద పెట్టిర్రని అన్నారు. ఎంఐఎంతో నిన్నటివరకు పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్..అదే ఎంఐఎంతో ఇప్పుడు కాంగ్రెస్  దోస్తీ చేస్తుందని చెప్పారు. అప్పనంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి భూములు అప్పగించారని విమర్శించారు. మెదట శంకరమ్మ, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు సీట్లు ఇవ్వండని రఘునంధన్ రావు సూచించారు.