V6 News

ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నం : బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నం : బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
  •     బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. గురువారం ముషీరాబాద్​లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఆర్టీసీని విలీనం చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పడం వల్లే కార్మికులు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. 

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి న్యాయం చేశారని, కానీ తెలంగాణలో మాత్రం గ్యారంటీల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. సమ్మెను నీరుగార్చేందుకు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపించడం వల్ల కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, బండారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.