లోక్సభ ఎన్నికలు.. 27 మందితో బీజేపీ మేనిఫెస్టో కమిటీ

లోక్సభ ఎన్నికలు..   27 మందితో బీజేపీ  మేనిఫెస్టో కమిటీ

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచేసింది. ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసిన  కమలం పార్టీ ..  తాజాగా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది.  కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన 27 మందితో కమిటీ ఏర్పాటు చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.  మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా,  కో-కన్వీనర్‌గా పీయూష్ గోయల్ ను నియమించారు.  

27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మకు కూడా చోటు దక్కింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి  ఒక్క నేతకు కూడా ఛాన్స్ దక్కలేదు.  కాగా  400 సీట్లే లక్ష్యంగా  ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.  

Also Read: రాహుల్ గాంధీపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థిపై 242 కేసులు

మరవైపు కర్ణాటక లోక్‌సభ ఎన్నికలకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షా, కె అన్నామలై రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలతో కలిసి బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు.