
గుడిమల్కాపూర్ కార్పొరేటర్, బీజేపీ నేత దేవర కరుణాకర్ మృతిపట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేసిన కరుణాకర్ .. ప్రజలందరికీ సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్న వ్యక్తి అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు గౌరవించి ఆత్మీయంగా పిలుచుకునే వ్యక్తి లేడనే వార్త తనని బాధిస్తోందని సంజయ్ తెలిపారు. కరోనా సమయంలో కరుణాకర్ పేద ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలిచారని సంజయ్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర మరువులేదని సంజయ్ చెప్పారు.
కార్పొరేటర్ కరుణాకర్ చనిపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ తరపునే కాకుండా వ్యక్తిగతంగానూ సేవా కార్యక్రమాలు కూడా చేసేవారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. బోజగుట్టలో పేద ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పొరాడారన్నారు. బీజేపీ ఒక మంచి, క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయిందన్నారు. బీజేపీతో కరుణాకర్ కు ఉన్న బంధం విడదీయలేనిదని తెలిపారు.