ఢిల్లీలో ప్రతి వైన్ షాప్ నుంచి 5 కోట్లు తీసుకున్నరు

ఢిల్లీలో ప్రతి వైన్ షాప్ నుంచి 5 కోట్లు తీసుకున్నరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ విచారణ జరుగుతున్న తరుణంలో బీజేపీ స్టింగ్ ఆపరేషన్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అమిత్ అరోరా అనే వ్యక్తి మద్యం విక్రయం, లావాదేవీల గురించి మాట్లాడుతున్నాడు. ‘‘గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు ఢిల్లీ నుంచే లిక్కర్ సరఫరా అవుతోంది. ఢిల్లీలోని ఒబెరాయ్, లోథి హోటల్స్ లో కూర్చుని ఈ లిక్కర్ పాలసీని తయారు చేశారు. అరుణ్ పిళ్లై, దీపకౌర్ చడ్డా, సమీరా మహేంద్ర, అమండల్ సహా పలువురు కలిసి ఈ పాలసీ తయారు చేశారు. కొంతమందికి లాభం చేకూర్చేలా ఈ పాలసీని రూపొందించారు. బ్లాక్ మనీని  వైట్ మనీ చెయడం కోసం కొంతమంది పెద్దలు ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టారు’’ అని ఆ వీడియోలో అమిత్ అరోరా చెప్పారు.

ఢిల్లీలో అవసరానికి మించి లిక్కర్ సరఫరా

ఢిల్లీలో లిక్కర్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బులను ఆప్ సర్కార్ పంజాబ్, గోవా ఎన్నికలలో ఖర్చు పెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధులు సుధాన్షు త్రివేది, అదేష్ గుప్త ఆరోపించారు. ఢిల్లీలో ప్రతి వైన్ షాపు దగ్గర నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారని, ఢిల్లీలో అవసరానికి మించి లిక్కర్ సరఫరా చేశారన్నారు. అవినీతిని అంతం చేస్తానన్న కేజ్రీవాల్.. అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ తన మిత్రులకు లాభం చేకూర్చాడని చెప్పారు.