ఖమ్మం, వరంగల్ సీట్లపై బీజేపీ హైకమాండ్ ఫోకస్

ఖమ్మం, వరంగల్ సీట్లపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
  • మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎన్నికల కమిటీ చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) శనివారం భేటీ అయింది. ఏపీతో పాటు పలు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో 15 లోక్ సభ స్థానాలకు పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది.

వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావ్ పేర్లను పార్టీ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఖమ్మం సీటు కోసం అనేక మంది నేతలు పోటీపడ్డారు. కానీ, చివరకు జలగం వెంకట్రావ్ కు పార్టీ చాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఏపీలో ఆరు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఏపీ బీజేపీ  రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ కు అందించినట్టు తెలిసింది.  కాగా, పలు దశల్లో ఇప్పటివరకు 291 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.