గుజరాత్‌లో బీజేపీ, హిమాచల్‌లో కాంగ్రెస్ లీడింగ్

గుజరాత్‌లో బీజేపీ, హిమాచల్‌లో కాంగ్రెస్ లీడింగ్

గుజరాత్‌లో మరోసారి భారతీయ జనతా పార్టీ రికార్డు సృష్టించబోతున్నట్టు తెలుస్తోంది. వరుసగా 7వ సారి గెలిచి దేశంలో కమ్యూనిస్టుల రికార్డును బీజేపీ సమం చేయనున్నట్టు కనిపిస్తోంది. గుజరాత్‌ చరిత్రలోనే అత్యధిక సీట్లు సాధిస్తామన్న ధీమాలో బీజేపీ ఉంది. అంతే కాకుండా ఈ ఎన్నికలతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించనుంది. 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా అర్హత లభిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్.. ఇప్పుడు గుజరాత్ లోనూ తమ హవాను సాగించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే గోవాలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు తోడు గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో ఏదో ఒక చోట 6 శాతం దాటితే ఆప్ కు జాతీయ పార్టీగా అర్హతలభించనుంది. జాతీయ పార్టీగా మారితే ఈవీఎం మెషీన్లలో మొట్టమొదటి పేరు ఆమ్ ఆద్మీ పార్టీ, సింబల్ నమోదు కానుంది. 

ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమైంది. గుజరాత్ లో ఇప్పటివరకు బీజేపీ117 కాంగ్రెస్ 46, ఆప్ 5 స్థానాలల్లో ముందంజలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో చూసుకుంటే బీజేపీ 26, కాంగ్రెస్ 29 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. ఇక గుజరాత్​లో 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో ఓటింగ్ నిర్వహించగా, హిమాచల్ ప్రదేశ్ లో 68 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు.