ఆరూనూరైనా తెలంగాణలో బీజేపీ వస్తుంది .. : కిషన్​రెడ్డి

ఆరూనూరైనా తెలంగాణలో బీజేపీ వస్తుంది .. : కిషన్​రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్​ లో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చేసిందన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని.. ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తున్నారన్నారు. మోడీ కార్యక్రమాన్ని బీఆర్​ఎస్​ ఎందుకు బహిష్కరించిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్​ఎస్​ను బహిష్కరించే రోజు వస్తుందని విమర్శించారు. 

వరంగల్ లో రైల్వే వ్యాగన్  పెడుతుంటే బీఆర్ఎస్ కు ఇష్టం లేదన్నారు.  కేసీఆర్​ ఎన్నికల హామీ అయిన రైతుమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఉచిత ఎరువులు తదితర హామీలు అమలు చేయలేదన్నారు.  గతంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కలిసి పని చేశాయని.. ఇప్పుడు బీఆర్​ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు దేశంలో భవిష్యత్తు లేదన్నారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంఐఎంను పెంచి పోషించాయన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా కలిసి కట్టుగా పని చేసి కల్వకుంట్ల కుటుంబాన్ని ఫాం హౌస్​కి పంపిస్తామన్నారు.