కాళేశ్వరం వెళ్లకపోవడం బీజేపీ తప్పే:మాజీ మంత్రి రవీంద్ర నాయక్

కాళేశ్వరం వెళ్లకపోవడం బీజేపీ తప్పే:మాజీ మంత్రి రవీంద్ర నాయక్
  • 12 మంది చాలన్న మంత్రి శ్రీధర్ బాబు   
  • నల్లగొండ టికెట్ ఇవ్వాలని అడుగుతున్న
  • మాజీ మంత్రి రవీంద్ర నాయక్

హైదరాబాద్​: బీజేపీ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్  హాట్ కామెంట్స్​ చేశారు. అసెంబ్లీలో ఇవాళ మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ మేడిగడ్డ ఘటనతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే అనుమానం ప్రజల్లో బలపడిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లక పోవడాన్ని  తప్పు పట్టారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని అనుమానం ప్రజలలో ఉందన్నారు. కేసీఆర్​అవినీతిపై బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోదని, ఎన్నికల్లో తాము గెలవలేమని వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉన్న సీనియర్ లంబాడి నాయకుడిని తానేనని, ఏ విషయంలోనూ కనీసం తనను సంప్రదించండం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  గతంలో మంత్రిగా, ఎంపీగా ఆ ప్రాంతంలో పనిచేసినందున నల్గొండ టికెట్ అడుగుతున్నానని, కనీసం  తనను బీజేపీ నేతలు పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.