V6 News

2 కోట్ల ఎక్స్‌‌‌‌గ్రేషియా ఇవ్వాలి : బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి 

2 కోట్ల ఎక్స్‌‌‌‌గ్రేషియా ఇవ్వాలి : బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి 

కాచిగూడ, వెలుగు : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని బర్కత్‌‌‌‌పురా డిపో వద్ద నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులకు మహేశ్వర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 2 కోట్ల ఎక్స్‌‌‌‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. క్రీడాకారులకు భారీగా నగదు బహుమతులు, ఉద్యోగాలు, స్థలాలు కేటాయిస్తున్న ప్రభుత్వం..  ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎందుకు విస్మరిస్తోందని ఆయన నిలదీశారు.