హైదరాబాద్, వెలుగు: పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ నేత గజ్జల యోగానంద్ పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా ఆదివారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో 500 జాతీయ జెండాలను కార్యకర్తలకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ.. దేశభక్తిని పెంపొందించేలా జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం మనందరి బాధ్యతని అన్నారు.
రెండ్రోజుల్లో వెయ్యికి పైగా జెండాలను పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు హర్ ఘర్ తిరంగ వెబ్ సైట్ https://harghartirang.com కు వెళ్లి అక్కడ సెల్ఫీ విత్ ఫ్లాగ్, పేరుతో పాటు ఫొటోను అప్ లోడ్ చేసి సర్టిఫికెట్ పొందవచ్చని ఆయన చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ సెంట్రల్ కో ఆర్డినేటర్, సుప్రీంకోర్టు లాయర్ నూనె బాలరాజు, సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు సతీశ్ పాల్గొన్నారు.