న్యూ ఇయర్ షాక్ : డిసెంబర్ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, అమెజాన్ సర్వీస్ బాయ్స్ పని చేయరా.. దేశ వ్యాప్త సమ్మె ఎందుకు..?

న్యూ ఇయర్ షాక్ : డిసెంబర్ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, అమెజాన్ సర్వీస్ బాయ్స్ పని చేయరా.. దేశ వ్యాప్త సమ్మె ఎందుకు..?

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. 2025, డిసెంబర్ 31వ తేదీన దేశ వ్యాప్తంగా జనం సంబరాల్లో ఉంటారు.. పార్టీలతో హోరెత్తుతారు.. మందు, విందుతో చిందులేస్తారు.. అలాంటి రోజు డిసెంబర్ 31వ తేదీ.. ఈ రోజు దేశ జనానికి మరో షాక్.. ఆ రోజు అంటే.. డిసెంబర్ 31వ తేదీన స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేవలు బాయ్ కాట్ చేస్తూ.. సర్వీసులు తీసుకోం అంటున్నారు సర్వీస్ బాయ్స్. ఆ రోజు దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెకు పిలుపునివ్వటం ఇప్పుడు కలకలం రేపుతోంది. 

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యూప్ బేస్డ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్లు (IFAT), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్, కర్నాటక యాప్ బేస్డ్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా సమ్మెకు మద్దతు ఇచ్చాయి. డిసెంబర్ 31వ తేదీన ఎలాంటి సర్వీసులను డెలివరీ చేయం అని.. ఆ రోజు సమ్మె చేస్తామని ప్రకటించటం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. డిసెంబర్ 31వ తేదీన ఫుడ్ ఐటమ్స్, గిఫ్ట్ లు ఇలాంటి డెలివరీలు భారీ సంఖ్యలో ఉంటాయి.. అలాంటి రోజు గిగ్ వర్కర్లు ఆర్డర్లు తీసుకోకపోతే పరిస్థితి ఏంటీ.. సమ్మె చేస్తే ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 

గిగ్ వర్కర్ల డిమాండ్ ఏంటీ..? :

>>> 10 నిమిషాల డెలివరీ టైం విధానాన్ని ఎత్తి వేయాలి. 10 నిమిషాల్లో డెలివరీ నియమం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని.. గిగ్ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. 
>>> ఫుల్ టైం గిగ్ వర్కర్లుగా పని చేస్తున్న వాళ్లకు జీతం, ఇతర ప్రొత్సాహకాలపై స్పష్టమైన, పారదర్శకమైన విధివిధానాలు ఉండాలి. 
>>> ప్రమాదం జరిగినప్పుడు ఆయా కంపెనీల నుంచి భద్రత, ఆరోగ్య రక్షణ కావాలని కోరుతున్నారు గిగ్ వర్కర్లు. 
>>> యాప్ బేస్డ్ కంపెనీలు ఏకపక్షంగా ఐడీలను బ్లాక్ చేయటం.. బ్లాక్ లిస్టులో పెట్టటం, జరిమానాలు విధించటం వంటి వాటిని ఉపసంహకరించుకోవాలి. 
>>> ఫుల్ టైం వర్క్ చేసే గిగ్ వర్కర్లకు పని గంటల విధానాన్ని అమలు చేయాలి. దీని వల్ల ప్రమాదాలు తగ్గుతాయని.. కార్మికులపై ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. 

ALSO READ : AI వల్ల పెరుగుతున్న కుర్ర బిలియనీర్లు..

ఈ డిమాండ్లను పరిష్కరించాలని..  ప్లాట్ ఫామ్ లను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే నిరసనలు చేపట్టారు. ఇందుకు కొనసాగింపుగా డిసెంబర్ 31వ తేదీన అన్ని ప్లాట్ ఫాం కింద పని చేసే గిగ్ వర్కర్లు డిసెంబర్ 31వ తేదీ దేశ వ్యాప్త సమ్మె చేయనున్నారు. 

న్యాయం, గౌరవం, జవాబుదారీతనం కోసమే మా ఉద్యమం, మా పోరాటం అనే నినాదంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని గిగ్ వర్కర్ల యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. సో.. న్యూ ఇయర్ జోష్ లో ఉన్న జనానికి ఆ రోజు డెలివరీ బాయ్స్ లేకపోతే.. ఇంటి గడప దగ్గరకు వచ్చి ఇచ్చే వాళ్లు లేకపోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆసక్తి రేపుతోంది.