ఓటర్లు లేకుండానే పోలింగ్ శాతం పెరిగిందా ? కిషన్ రెడ్డి

ఓటర్లు లేకుండానే పోలింగ్ శాతం పెరిగిందా ? కిషన్ రెడ్డి

ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేసిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో నమోదైన ఓటింగ్ శాతంపై  బీజేపీ నేత కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిన్న పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓటింగ్ శాతానికి ఆ తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి తేడా ఉందని ఆయన  అన్నారు. గురువారం 35 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారని, ఇవాళ 45 శాతం పోలింగ్‌ అని చెబుతున్నారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా ఓటింగ్ జరిగిందా? అని అనుమానం వ్యక్తం చేశారు.

నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి పోలింగ్ బూత్ లలో ఎవరూ లేకపోయినా పోలింగ్ శాతం ఎలా పెరిగిందని, ఈ విషయంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివరణ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు.